ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు, రౌడీ షీటర్లు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని చట్టాలకు లోబడి ప్రశాంతంగా జీవనం గడపాలని సూచించారు, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు, ఎలాంటి నేరాలకు పాల్పడిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు