గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో వైసీపీని విడి టిడిపిలో చేరిన అర్ధవీడు మండలానికి చెందిన 50 కుటుంబాలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో అర్ధవీడు మండలానికి చెందిన 50 కుటుంబాలు ఆదివారం వైసీపీని వీడి టిడిపిలో చేరాయి. మాగుటూరు, కాకర్ల కొత్తూరు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడాయి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసిపి కార్యకర్తలు కూటమి వైపు చూస్తున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిందని స్థానిక ఎన్నికలలో మన పార్టీ గెలిచే విధంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.