ఆళ్లగడ్డ: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకితంగా ఆధ్వర్యంలో ర్యాలీ నేతలు డిమాండ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వాల్మీకి జాతికి ఎస్టీ పునరుద్ధరించాలని వాల్మీకి సంఘం నేతలు డిమాండ్ చేశారు, శుక్రవారం ఆళ్లగడ్డ మండల పరిధిలోని బత్తులూరు గ్రామంలో వాల్మీకి సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు, అనంతరం చలో ప్యాపిలి కార్యక్రమానికి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు, గతంలో రాష్ట్రమంతా ఎస్టీలుగా ఉన్న వాల్మీకులను పాలకులు అన్యాయంగా కొన్ని ప్రాంతాల్లో బీసీలుగా చేర్చారని, తిరిగి ఎస్టి జాబితాలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు