ఒంగోలు అర్బన్: ఒంగోలులో అగ్నిమాపక శాఖ మూడవ జోనల్ సమావేశం, హాజరైన జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, సమస్యల పరిష్కారం పై చర్చ
Ongole Urban, Prakasam | Oct 1, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం అగ్నిమాపక శాఖ మూడవ జవనాలు సమావేశం జరిగింది. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు అగ్నిమాపక శాఖ బలోపేతానికి 250 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసింది అని అన్నారు. అలానే అగ్గిమాపక సిబ్బంది సమస్యల పరిష్కారానికి వారి సమస్యలపై దృష్టిసారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అగ్నిమాపక సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.