కనిగిరి: వెలిగొండ ప్రాజెక్టు రెండవ దశను పూర్తి చేసి కనిగిరి కి సాగునీరు అందించాలి: ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసి, నీరు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబుకు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్టు రెండవ దశను పూర్తిచేస్తే కనిగిరి నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని, రెండవ దశ నిర్మాణానికి నిధులు ఇచ్చి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి కోరారు.