శ్రీశైలం: శ్రీశైలం ఘాట్ రోడ్డులో మరోసారి వాహనాల భారీ ట్రాఫిక్ జామ్.10 కిలోమీటర్ల మేరా నిలిచిపోయిన వాహనాలు
శ్రీశైలం ఘాట్ రోడ్డులో మరోసారి వాహనాల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నేడు ఆగష్టు 15 రేపు ఆదివారం సెలవు నేపథ్యంలో క్షేత్రానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు భక్తుల సొంత వాహనాలలో భారీగా వస్తుండటం పైగా శ్రీశైలానికి వచ్చి వెళ్లే వాహనాలుకు సింగిల్ రోడ్డు కావడంతో శ్రీశైలం ఘాట్ రోడ్డు వాహనాల రద్దీ పెరిగిన ప్రతిసారి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది ట్రాఫిక్ అంతరాయంతో నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి సాక్షిగణపతి నుంచి హఠకేశ్వరం వరకు మళ్ళీ ముఖద్వారం నుండి సుండిపెంట వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడంతో సుమారు 10 కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయి భక్తుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.