బనగానపల్లె: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బనగానపల్లెలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జంగం శెట్టి ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్య వైశ్యులందరూ కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. హక్కుల సాధనకై శాంతియుత పోరాటమార్గాన్ని ప్రవచించి, ఆచరణలో చూపిన మహాత్మా గాంధీ చిరస్మరణీయులని కొనియాడారు. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గాంధీ మార్గం ఎప్పటికీ ఆదర్శ పాయమన్నారు