జగ్గంపేట: గోకవరం సంజీవయ్యనగర్‌లో వీధి కుక్కల దాడి: ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
గోకవరం సంజీవయ్యనగర్‌లో వీధి కుక్కల దాడి స్థానికులను కలవరపెడుతోంది. మంగళవారం రాత్రి కుక్కలు దాడి చేయడంతో ముగ్గురు గాయపడగా, ఒకరు మృతి చెందినట్లు సమాచారం. కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.