నిర్మల్: నిర్మల్ జిల్లాలో విషాదం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Nirmal, Nirmal | Sep 30, 2026 నిర్మల్ జిల్లా డ్యాంగాపూర్ గ్రామంలో అప్పుల బాధతో రైతు కడతాల అంజయ్య పురుగుల మందు తాగి మృతి చెందారు. సాగు చేసిన పంటలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో 8 లక్షల అప్పులు కావడమే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.