ఒంగోలు అర్బన్: జరుగుమల్లి బాలికల సంక్షేమ హాస్టల్ వద్ద తమ పిల్లల్ని ఇంటికి పంపించాలని నిరసనకు దిగిన విద్యార్థినీల తల్లిదండ్రులు
Ongole Urban, Prakasam | Oct 1, 2026
ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ సంక్షేమ హాస్టల్ వద్ద గురువారం విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హాస్టల్ వార్డెన్, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ వెంకటేశ్వరరావు హాస్టల్ వద్దకు చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు. దీంతో విద్యార్థినిల తదితరులు శాంతించారు.