నందికోట్కూరు: బ్రాహ్మణ కోట్కూరులో రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు ఎస్సై మణికంఠ
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై మణికంఠ భద్రతా చర్యలు చేపట్టారు, వేగంగా వెళ్లే వాహనాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రహదారిపై స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయించారు, వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన సూచించారు