పుంగనూరు: పుంగనూరులో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
అన్నమయ్య జిల్లా పుంగనూరులో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున, బహిరంగ ప్రదేశాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.