ఒంగోలు అర్బన్: ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
Ongole Urban, Prakasam | Aug 16, 2026
స్వాతంత్ర్య పోరాటంలోనూ, ప్రజా సేవలోనూ తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి ' సర్దార్ ' గౌతు లచ్చన్న అని జిల్లా కలెక్టర్ రాజాబాబు కొనియాడారు. లచ్చన్న 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ప్రకాశం భవనంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం తన జీవితకాలమంతా లచ్చన్న శ్రమించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారని చెప్పారు