మంచిర్యాల: వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి - ఆసుపత్రి ముందు బంధువుల నిరసన
మంచిర్యాల ప్రతిభా నర్సింగ్ హోమ్ వైద్యుల నిర్లక్ష్యంతో రుచిత అనే గర్భిణి మరణించింది. డబ్బుల కోసం సమయం వృధా చేసి, సరైన చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.