శ్రీశైలం: మహానంది మండలం ఎం. తిమ్మాపురం ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత గుండెపోటుతో మృతి
మహానంది మండలం ఎం. తిమ్మాపురానికి చెందిన ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత(45) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఏపీ మోడల్ స్కూల్ వద్ద సమావేశం నిర్వహించేందుకు వెళ్లగా అక్కడున్న వారితో మాట్లాడుతూ ఉండగానే కింద పడింది. దీంతో అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోలుకోలేక మృతి చెందింది. సూపర్వైజర్ మృతికి సహ ఉద్యోగులు సంతాపం తెలియజేశారు