బనగానపల్లె: దర్గాను దర్శించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయిని పేటలోని మహబూబ్ సుభాని దర్గాను బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గురువారం రాత్రి సందర్శించారు. సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ఫతేహాలు సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మాజీ వైస్ ఎంపీపీ ఉప్పలూరు కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య, చిన్న, బాబు, శేషఫణి, మహబూబ్ పీరా తదితరులు ఉన్నారు.