మంచిర్యాల: మంచిర్యాలలో వయోవృద్ధులకు ప్రత్యేక వైద్య శిబిరం: ఉచిత మందుల పంపిణీ
జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలోని రెడ్‌క్రాస్ వృద్ధాశ్రమంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. 25 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. వృద్ధుల హక్కులు, చట్టాలపై అధికారులు అవగాహన కల్పించారు.