ఒంగోలు అర్బన్: ఒంగోలు ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేజీ పైన పాట పాడిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
Ongole Urban, Prakasam | Sep 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర 150 ఏళ్ల వేడుకల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్టేజీపై పాటపాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఆయన ఆలపించిన పాటకు ప్రేక్షకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. దీంతో వేడుకల ప్రాంగణం మరింత ఉత్సాహభరితంగా మారింది. అనంతరం నిర్వహించనున్న లైవ్ బ్యాండ్ షో, క్రాకర్ షోతో 150 ఏళ్ల వేడుకలు ఘనంగా ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు ప్రజలు భారీగా పాల్గొన్నారు.