కనిగిరి: వెలిగండ్ల మండలం వెంగళరెడ్డి పల్లి లో గోకులం షెడ్డు కు శంకుస్థాపన చేసిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
వెలిగండ్ల మండలం వెంగళరెడ్డి పల్లిలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించనున్న గోకులం షెడ్డు కు జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే తో కలిసి శంకుస్థాపన చేశారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.... పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వారి కోసం గోకులం షెడ్ల నిర్మాణాల కు శ్రీకారం చుట్టిందన్నారు. గోకులం షెడ్లను పాడి రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.