మచిలీపట్నం: మచిలీపట్నంలో మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన
మచిలీపట్నం నగర పాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.7.70 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొన్నారు.