ఒంగోలు అర్బన్: ఒంగోలుకు చారిత్రక విశిష్టత ఉందని, ఈ చరితను చాటి చెప్పేలా, చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా చూడాలి
Ongole Urban, Prakasam | Aug 16, 2026
ఒంగోలుకు ఎంతో చారిత్రక విశిష్టత ఉందని, ఈ ఘన చరితను చాటి చెప్పేలా, చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా నిర్వహించే వేడుకలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి సెప్టెంబర్ 30వ తేదీకి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అట్టహాసంగా జరిగింది. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన తదితరులు పాల్గొన్నారు