దర్శి: దొనకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Darsi, Prakasam | Aug 15, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయగీతం ఆలపించారు. దేశభక్తి నైతిక విలువల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశం అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. 2047 లక్ష్యసాధనకు కృషి చేయాలని యువకులకు దిశా నిర్దేశం చేశారు.