కనిగిరి: తాడేపల్లి లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐడీ కార్డుల పంపిణీ మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ పరిధిలో బలమైన అభ్యర్థులను బరిలో దింపి, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసా ఇచ్చినట్లు నారాయణ యాదవ్ తెలిపారు.