గద్వాల్: పోలీస్ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు: ఎస్పీ శ్రీనివాస రావు సందేశం
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ టి. శ్రీనివాస రావు పాల్గొని వారి ఆశయాలను గుర్తు చేశారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.