కనిగిరి: ప్రతి గ్రామంలో అక్టోబర్ చివరి నాటికి ఒక టన్ను వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి: కనిగిరి ఎంపీడీవో అబ్దుల్ ఖాదర్
కనిగిరి :ప్రతి పంచాయతీలో అక్టోబర్ చివరి నాటికి ఒక టన్ను వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని కనిగిరి ఎంపీడీఓ అబ్దుల్ ఖాదర్ ఆదేశించారు. సోమవారం మండలంలోని అలవలపాడు, తక్కెళ్లపాడు, బల్లిపల్లి పంచాయతీల్లో ఎస్ఈబ్ల్యూబీపీసీ షెడ్లు, స్వచ్ఛ రథం, బిన్ బ్యాగుల నిర్వహణను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా సేంద్రియ వ్యర్థాలను సమర్థంగా వినియోగించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో ఆదేశించారు.