వర్ధన్నపేట: వరంగల్: కోతుల బెడదకు గ్రామస్థుల స్వచ్ఛంద చర్య
వరంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో కోతుల బెడద పెరగడంతో గ్రామస్థులు స్వచ్ఛందంగా స్పందించారు. సర్పంచ్ కౌడగని సునీత ఆధ్వర్యంలో చందాలు వేసుకుని కోతులను పట్టించి, అడవిలో వదిలేసేందుకు ఏర్పాట్లు చేశారు. పంటలు, ఇళ్లకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.