ఉరవకొండ: వెంకటాద్రి పల్లి గ్రామంలో ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం వెంకటాద్రి పల్లి గ్రామంలో రామగిరి మండలము, కుంటిమిద్దె కి చెందిన ఎరికల రామలక్ష్మి (44) అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై బెళుగుప్ప ఎస్ఐ శివ శుక్రవారం తెలిపిన వివరాల మేరకు మృతురాలు గత మూడు సంవత్సరాల నుండి వెంకటాద్రి పల్లి గ్రామానికి చెందిన తలారి వెంకటేశులతో సహజీవనం చేస్తున్నది అయితే వారి కుటుంబ విషయంలో గురువారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి రామలక్ష్మి ఉరి వేసుకుని చనిపోయిందన్నారు. సదరు రామలక్ష్మి కూతురు అయిన రమాదేవి ఘటనపై ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై పేర్కొన్నారు.