బనగానపల్లె: దేశభక్తి చాటుకున్న బనగానపల్లె ఆర్యవైశ్యులు
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బనగానపల్లెలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భారతమాత అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. కార్యక్రమంలో అర్చకుడు నరేశ్, ఆర్యవైశ్య పెద్దలు, జంగంశెట్టి మహిళా మండలి, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.