కనిగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన వ్యక్తులను గెలిపించుకోకపోతే అభివృద్ధి అసాధ్యం: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
వెలిగండ్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన అభ్యర్థులను గెలిపించుకోకపోతే గ్రామాల్లో అభివృద్ధి అసాధ్యమని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. వెలిగొండలో గురువారం జరిగిన పేదల సేవలో 2.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తమ కులం వారనో, లేక డబ్బులు ఇచ్చారనో ఓట్లు వేసి గెలిపించుకుంటే అభివృద్ధి జరగదని ఎమ్మెల్యే స్థానికులకు సూచించారు. ఇటీవల వరికుంటపాడు మండలానికి వచ్చిన సీఎం చంద్రబాబు బల్లిపల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి రూ. 1000 కోట్లు ప్రకటించారని, సరైన నాయకత్వాన్ని ఎంచుకుంటే అభివృద్ధి సాధ్యం అనేదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని ఎమ్మెల్యే తెలిపారు.