జగిత్యాల: జగిత్యాలలో 25వ రక్తదాన శిబిరం ప్రారంభం: ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల ఐఎంఏ భవన్లో 'డొనేట్ బ్లడ్-సేవ్ లైవ్స్' కార్యక్రమంలో భాగంగా 25వ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.