మందమర్రి: రామకృష్ణాపూర్లో సింగరేణి కార్మికులకు గుండె ఆరోగ్యంపై అవగాహన
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రామకృష్ణాపూర్ సిహెచ్పీలో సింగరేణి కార్మికులకు గుండె ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మధు కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలి, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలను వివరించారు.