నంద్యాల అర్బన్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వీఆర్ఏల అర్థనగ్న నిరసన
Nandyal Urban, Nandyal | Oct 3, 2026
నంద్యాలలో వీఆర్ఏల అర్ధనగ్న ప్రదర్శన తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్పీలు చేపట్టిన రిలే దీక్ష 18వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా వీఆర్ఎలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి, ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. తెలంగాణ తరహాలో వీఆర్పీలకు పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు.