సాలూరు: సాలూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం: కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం
సాలూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మంత్రి సంధ్యారాణి గారు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం 5 రూపాయలకే అన్నం, పప్పు, కూర, సాంబార్, పెరుగుతో కూడిన భోజనాన్ని పేదలకు అందిస్తున్నారు. కూలీలు, చిరు వ్యాపారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.