గిద్దలూరు: 2026 కీర్తి ఐకాన్ పురస్కారం అందుకున్న యోగా టీచర్ బి.యస్. నారాయణరెడ్డి
హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి.యస్. నారాయణరెడ్డి 2026 కీర్తి ఐకాన్ పురస్కారాన్ని అందుకున్నారు. స్వచ్ఛంద సేవా రంగంలో చేస్తున్న కృషికి గాను ఈ గౌరవం లభించింది. తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలవడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.