పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో కూలిన రచ్చబండ: తృటిలో తప్పిన భారీ ప్రమాదం
పార్వతీపురం మన్యం జిల్లా దేవకోన పంచాయతీ అంటి వలస గ్రామంలో భారీ వర్షాలకు రచ్చబండ కూలి ఒక ఇంటిపై పడింది. అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులు బయట ఉండటంతో ప్రమాదం తప్పింది. బాధితుడిని ఆదుకోవాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.