నేలకొండపల్లి: నాణ్యత లేని చెప్పులు.. మెట్రో బ్రాండ్ సంస్థకు భారీ జరిమానా
నాణ్యత లేని చెప్పులు విక్రయించిన మెట్రో బ్రాండ్ లిమిటెడ్ సంస్థపై ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది. బాధితుడికి చెప్పుల ధరతో పాటు మానసిక వేదనకు రూ. 10 వేలు, కేసు ఖర్చులకు రూ. 5 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.