కనిగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేయాలి: వెలిగండ్ల మండల టిడిపి అధ్యక్షులు భూపాల్ రెడ్డి
వెలిగండ్ల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెలిగండ్ల మండలంలో టిడిపి ఘను విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు ఇప్పటినుండే ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని వెలిగండ్ల మండల టిడిపి అధ్యక్షులు ఇంద్రభూపాల్ రెడ్డి టిడిపి శ్రేణులకు సూచించారు. బుధవారం వెలిగండ్ల టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంద్ర భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ..వెలిగండ్ల మండలంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ఇదే స్ఫూర్తితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో టిడిపి గెలుపొందేలా పని చేయాలన్నారు.