గిద్దలూరు: కొమరోలు మండలంలో జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలలో నలుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నడిచి వెళుతున్న వ్యక్తిని బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎర్రపల్లె సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వైద్యులు మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.