ఒంగోలు అర్బన్: ఒంగోలులో పర్యటించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిన్నప్పుడే తన అమ్మ చనిపోయిందని ఎమోషనల్ స్పీచ్
Ongole Urban, Prakasam | Sep 30, 2026
ప్రకాశం: నాకు 13 నెలల వయసు ఉన్నప్పుడే ఎద్దు పొడవడం వల్ల మా అమ్మ చనిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఒంగోలు ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులో వెంకయ్య నాయుడు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా తాను రాజకీయంగా ఎలా ఎదిగానో ప్రజలకు వివరించారు. గత ప్రధాని వాజ్పేయి వస్తున్నారని మైక్ లో ప్రచారం చేసిన నేను ఆయనతో కలిసి పనిచేశానన్నారు. తర్వాత తాను అలంకరించిన పదవులను వివరించి చెప్పారు.