డోన్: బేతంచెర్లలో శనివారం మాంసం విక్రయాలు బంద్, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: కమిషనర్
Dhone, Nandyal | Aug 14, 2026 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బేతంచెర్లలో శనివారం మాంసం విక్రయాలు చేపడితే చర్యలు తప్పవని నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్ హెచ్చరించారు. ప్రధానంగా పట్టణంలోని ఆయా కూడళ్లలోని మాంసం దుకాణాలతో పాటు హోటల్స్, రెస్టారెంట్లలో మాంసం విక్రయించవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.