ఉరవకొండ: క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి, క్రీడలతో బంగారు భవిష్యత్తు మీ సొంతం
-అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్
విద్యార్థులు క్రీడల్లో బాగా రాణించాలని చిన్నప్పటినుండే క్రీడలపై ఆసక్తిని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఉరవకొండ శ్రీ కర్రి బసవప్ప జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో నియోజకవర్గం స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలల్లో అనంతపురం స్పోర్ట్స్ చాంపియన్షిప్ లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. అలాగే మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారు