కనిగిరి: బడుగులేరు స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస రెడ్డి
కనిగిరి మండలంలోని బడుగులేరు స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని కనిగిరి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. స్వర్ణ గ్రామ సిబ్బంది ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా వాట్స్అప్ గవర్నమెంట్ పెండింగ్లో ఉన్న పలు సర్వేలపై ఆయన సమీక్షించి, పెండింగ్ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.