కనిగిరి: కనిగిరి నుండి సీఎం సభకు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లిన ఎన్డీఏ కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు
వరికుంటపాడు మండలం రామపురం గ్రామంలో నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి మున్సిపాలిటీ నుండి 27 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఆ బస్సుల్లో కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు రామాపురం తరలి వెళ్లారు.