జగ్గంపేట: గండేపల్లిలో టీడీపీ నేతల మధ్య తోపులాట: తాళ్లూరులో ఉద్రిక్తత
గండేపల్లి మండలం తాళ్లూరులో జరిగిన ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం ముగిసిన తర్వాత టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. స్థల వివాదం కారణంగా నేతల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది.