నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్: రుణమాఫీ, బోనస్ హామీల అమలులో విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ, వరి బోనస్, రైతు భరోసా హామీలను నెరవేర్చలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ విమర్శించారు. కిసాన్ మోర్చా సైకిల్ యాత్రలో పాల్గొన్న ఆయన, హామీలు అమలు చేయకపోతే ప్రజా పోరాటాలు తప్పవని హెచ్చరించారు.