జగిత్యాల: సీపీఐ(ఎం)లో చేరిన ప్రముఖ న్యాయవాది ఉమా మహేష్
జగిత్యాల జిల్లాలో ప్రముఖ న్యాయవాది కూర్మాచలం ఉమా మహేష్ సీపీఐ(ఎం) పార్టీలో చేరారు. జిల్లా ఇంచార్జి లెల్లెల బాలకృష్ణ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేసే ఉద్దేశంతోనే పార్టీలో చేరినట్లు ఉమా మహేష్ తెలిపారు.