బనగానపల్లె: నందవరం చౌడేశ్వరికి శ్రావణమాస పూజలు
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రావణమాసం కావడం, నాగుల పంచమి నేపథ్యంలో అర్చకులు వేకువజామున అమ్మవారికి విశేష అలంకరణ చేపట్టారు. మహా మంగళ హారతులు ఇచ్చారు. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.