భీమిలి: అనారోగ్య బాధితులకు 13.55 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
విశాఖపట్నంలో 24 మంది అనారోగ్య బాధితులకు 13.55 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అందజేశారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆనందపురం, పద్మనాభం మండలాలు మరియు వివిధ వార్డుల వారికి ఆర్థిక సాయం అందించారు.