ఒంగోలు అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారం కొరకే గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ రాజబాబు వెల్లడి
Ongole Urban, Prakasam | Oct 1, 2026
ప్రజా సమస్యల పరిష్కారం కొరకే గ్రామీణ ప్రాంతాలలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. గురువారం మద్దిపాడు మండలంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ కల్పనకుమారితో పాటు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో ముఖాముఖిగా కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.