కనిగిరి: రామాపురంలో సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్లను పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి
కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వరికుంటపాడు మండలం రామాపురంలో ఆదివారం పర్యటించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈనెల 29న రామాపురంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. వాహనాల పార్కింగ్, సభా వేదిక, బందోబస్తు తదితర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. సభకు ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నదృష్ట వారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.